మూడు రాజధానులు అనేది వైసీపీ విధానం : విజయసాయిరెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం అనుకున్నట్లుగానే జరుగుతాయని విజయసాయిరెడ్డి తేల్చిచెప్పారు. శనివారం విశాఖలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  న్యాయ స్థానంలో తేలిన తర్వాత స్థానిక ఎన్నికలు జరుగుతాయన్నారు. చంద్రబాబు అన్నింటిని నెగిటివ్‌గానే ఆలోచిస్తారని విమర్శించారు. నిన్న పోలీసు పడిపోయిన దాన్ని కూడా అదే విధంగా చిత్రీకరించారని చెప్పారు. ఆయనలో ఉన్న మూర్ఖత్వం, దుర్మార్గపు ఆలోచన పోనంతవరకు ఆయన, ఆ పార్టీ మనుగడ కష్టమని చెప్పారు. 

మూడు రాజధానులు అనేది వైసీపీ విధానం.. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అన్ని విధాలా సంప్రదించిన తర్వాతే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పాలనా రాజధాని విశాఖ, శాసన రాజధాని అమరావతి, న్యాయ రాజధాని కేంద్రం, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న విషయం.. కానీ మా ఆలోచన మాత్రం కర్నూలు న్యాయ రాజధాని అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

 

Leave a Comment