బెంగాల్ లో వింత ఘటన..30 ఏళ్ల తర్వాత మగాడని తెలిసింది..

పశ్చిమ బెంగాల్ లో వింత ఘటన చోటుచేసుకుంది. 30 ఏళ్ల తర్వాత ఆమె మగాడని తెలిసింది. ఇది తెలిసి భర్త షాక్ కు గురయ్యాడు. అసలేం జరిగిందంటే..పశ్చిమ బెంగాల్ లోని బీర్ భూమ్ లో నివసిస్తున్న 30 ఏళ్ల మహిళకు పదేళ్ల కింద పెళ్లి అయింది. అప్పటి నుంచి భార్యభర్తలు పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తున్నా..వారికి పిల్లలు కలగలేదు. ఎంతో మంది వైద్యులను సంప్రదించారు. అయినా ఫలితం లేకపోయింది. 

ఓ రోజు ఆమె పొత్తి కడుపులో తీవ్రనొప్పితో భాధపడుతుండటంతో ఆమె భర్త వెంటనే ఆస్పత్రిలో చేర్పించాడు. ఇక ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతే..ఆమె మహిళ కాదు..పురుషుడని వైద్యులు తెలిపారు. ఆమె వృషణ క్యాన్సర్ తో బాధపడుతోందని తెలిసింది. దీంతో ఆమె భర్త షాక్ కు గురయ్యాడు. 

ఇన్ని రోజులు ఆమెకు లక్షణాలు ఎందుకు కనిపించలేదు..

ఆమెను ఇటీవల సుభాష్ చంద్రబోస్ క్యాన్సర్ ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు పరీక్షలు చేశారు. ఆమెకు ‘ఆండ్రోజెన్ ఇన్సెన్సిటివిటీ సిండ్రోమ్’ (Androgen Insensitivity Syndrome) వల్ల పురుష లక్షణాలు కనిపించలేదని వైద్యులు తెలిపారు. 

కాగా, ఆమె బాల్యం నుంచి అమ్మాయిలాగే పెరిగింది. ఆమె మాట, శరీరం అన్ని అమ్మాయి లాగే ఉండేవి. వక్షోజాలు కూడా పెరిగాయి. మర్మాంగాలు కూడా మహిళల తరహాలోనే ఉన్నాయి. అయితే ఆమె మర్మాంగాలు పురుషుడివే అని వైద్య పరీక్షల్లో తేలింది. అరుదైన కారణాల వల్ల ఆమె వృషణాలు శరీరంలోకి చొచ్చుకుని ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆమె మేనత్తల్లో కూడా ఇలాంటి సమస్య ఉందని, వారి జీన్స్ వల్లే వీరికి కూడా అది సంక్రమించిందని వైద్యులు చెప్పారు. ‘ఆండ్రోజెన్ ఇన్సెన్సిటివిటీ సిండ్రోమ్’ వల్ల మర్మాంగాలు శరీరంలోకి కుచించుకుపోతాయన్నారు. అయితే ఆమెను మహిళగా చూడాలని, ఎప్పటిలాగే కలిసి ఉండాలని ఆమె భర్తకు వైద్యులు సూచించారు. 

Leave a Comment