ఏపీలో పెరగనున్న రేషన్ సరకుల ధరలు..

ఆంధ్రప్రదేశ్ లో రేషన్ షాపుల ద్వారా సరఫరా చేసే చక్కెర, కందిపప్పు ధరలు పెరగనున్నాయి. జులై నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి. అయితే అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకు మాత్రం చక్కెర ధరలు యధాతథంగా ఉంటాయి. సాధారణ తెల్ల రేషన్ కార్డుదారులకు మాత్రం ఇకపై పెరిగిన ధరలు వర్తించనున్నాయి. 

ఇప్పటి వరకు రూ.40 ఉన్న కందిపప్పు ధరను రూ.67కు, అలాగే అరకిలో చక్కెర ధర రూ.10 ఉండగా ప్రస్తుతం ఆ ధరను రూ.17కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్కెట్ లో ధర ఎంత ఉన్నా 25 శాతం మాత్రమే రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మార్కెట్ ధరల ప్రకారం రేషన్ సరకుల ధరలు పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Leave a Comment