ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీకి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్

అమరావతి : ఏపీలో ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీపై అభ్యంతరం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం లేఖ రాసింది. నవరత్నాలు ‘పేదలు అందరికి ఇల్లు’ పథకాన్ని కొనసాగించవచ్చని తెలిపింది. సుప్రీంకోర్టు 437/20  తీర్పును అనుసరించి రెవెన్యు ముఖ్య కార్యదర్శికి ఎన్నికల కమిషన్ కార్యదర్శి రాం సుందర్ రెడ్డి లేఖ రాశారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హైదరాబాద్‌లో తనకు కేటాయించిన కార్యాలయం నుంచి అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వెంటనే గృహ స్థలాల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కమిషనర్ క్లియర్ చేశారు. పేదలకు ఇళ్లు అప్పటికే కొనసాగుతున్న పథకమని సుప్రీం కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు రాష్ట్రంలో కొనసాగుతున్న పథకాలు ముందుకు సాగేలా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

 

Leave a Comment