భారత సైన్యంపై తెగబడ్డ చైనా సైన్యం..

లద్దాఖ్ లోని గాల్వన్ వ్యాలీలో చైనా ఆర్మీ ఘర్షణకు దిగింది. గత కొంత కాలంగా సరిహద్దు విషయంలో కొనసాగుతున్న వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం భారత సైన్యంపై చైనా దాడులకు పాల్పడింది. రాళ్లు, కర్రలతో ఇరు సైన్యాలు ఘరణకు దిగారు. ఈ దాడిలో ఒక భారత సైనిక అధికారి మరియు ఇద్దరు జవాన్లు మరణించారు. మరి కొంత మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. సరిహద్దులో చైనా చర్యలపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

ఈశాన్యంలోని గల్వాన్ వ్యాలీ, పాంగోంగ్ త్సోలోని ఎల్ఏసీ ఇండియా సరిహద్దు వైపు అధిక సంఖ్యలో చైనా దళాలు శిబిరాలు ఏర్పాటు చేశాయి. దీంతో తూర్పు లదాఖ్ లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి అనేక ప్రాంతాల్లో భారత్, చైనా దళాల మధ్య నెల రోజులుగా భీకర పోరాటాలు జరుగుతున్నాయి. ఓవైపు ఇరు దేశాల దౌత్యవేత్తలు చర్యలు జరుపుతున్నాయి. అయినా భారత జవాన్లపై చైనా ఆర్మీ రెచ్చగొట్టే చర్యలు చేపడుతోంది.  ఈ ఘటనలో చైనా సైనికులు కూడా మరణించినట్లు సమాచారం. 

 

Leave a Comment