విషాదం : బిస్కెట్లు తిని చిన్నారి మృతి

కర్నూలు జిల్లాలో విషాదం జరిగింది. బిస్కెట్లు తిని ఒక చిన్నారి మరణించాడు. మరో ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కర్నూలు జిల్లా చింతకొమ్ముదిన్నె గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల మేరకు గ్రామంలోని ఓ దుకాణంలో హుస్సేన్ బాష(6), హుస్సేన్ బి(4), మరో చిన్నారి(8) బిస్కెట్ ప్యాకెట్ కొని తెచ్చుకున్నారు. 

ఆ బిస్కెట్లు తిన్న కొద్ది సేపటికే ఆ చిన్నారులు కడునునొప్పితో విలవిల్లాడి వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కుటుంబ సభ్యులు వారిని హూటాహుటిన ఆళ్లగడ్డలోని వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ హుస్సేన్ బాష చనిపోయాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు వైద్యశాలకు తీసుకెళ్లారు. చిన్నారులు తిన్న బిస్కెట్లు విషతుల్యం అయినట్లు తెలుస్తోంది. వారు కొన్న బిస్కెట్ల ప్యాకెట్ పై ‘రోజ్ మ్యాంగో’ అనే పేరు ఉంది. 

Leave a Comment