ప్రారంభించిన 29 రోజులకే కూలిన బ్రిడ్జి..!

బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లాలో సత్తార్ ఘాట్ బ్రిడ్జి  ప్రారంభించిన 29 రోజులకే కుప్ప కూలిపోయింది. భారీ వర్షాలు పడటంతో గండక్ నదీలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో బ్రిడ్జీ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ బ్రిడ్జిని బీహార్ సీఎం నితీష్ కుమార్ నెల క్రితమే ప్రారంభించారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి దాదాపు రూ.260 కోట్లు ఖర్చయ్యాయి. దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఈ బ్రిడ్జిని నిర్మించారు.  ప్రారంభించిన నెలకే బ్రిడ్జి కూలిపోవడంతో నాసిరకంగా నిర్మించారంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై బీహార్ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. 

బీహార్ లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరదలు వచ్చాయి. ఈ వరదలకు అక్కడి నదులు ఉధృతంగా ప్రవహస్తున్నాయి. వరద ఉధృతికి గోపాల్ గంజ్ జిల్లాలోని గండక్ నదిపై నిర్మించిన సత్తార్ ఘాట్ బ్రిడ్జి కూలిపోయింది. ఈ బ్రిడ్జిని జూన్ లో సీఎం నితీష్ కుమార్ ప్రారంభించారు. సాక్ష్యాత్తు సీఎం ప్రారంభించిన బ్రిడ్జి నెలతిరక్కుండానే కూలిపోవడంతో స్థానికులు విమర్శిస్తున్నారు. బ్రిడ్జి కూలిపోవడంతో రూ.263 కోట్లు ఖర్చు నీటిపాలు అయిందని స్థానికులు మండిపడుతున్నారు. ఇంత నాసిరకంగా ఎలా నిర్మించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రిడ్జి కూలిపోవడంతో చంపారన్, సరన్ తో పాటు మరిన్ని జిల్లాలకు సంబంధాలు తెలిపోయాయి. 

Leave a Comment