ఆస్ట్రేలియా స్కూళ్లలో తెలుగు పాఠాలు..!

తెలుగు భాష తియ్యదనం..తెలుగు జాతి గొప్పతనం తెలుగుసుకున్న వారికి తెలుగే ఒక మూలధనం…. చక్కని పలుకుబడులకు, నుడికారములకు తెలుగు భాషయే పుట్టినిల్లు..అలాంటి తెలుగుకు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం దక్కింది. ఇక్కడి పాఠశాల్లలో తెలుగు మీడియంను తీసేసి ఇంగ్లీష్ మీడియంను బోధించాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం అక్కడి స్కూళ్లలో తెలుగును ఐచ్చిక అంశంగా చేరుస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

దీంతో అక్కడ ఒకటి నుంచి 12వ తరగతి వరకు ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో ఇకపై తెలుగు భాషను నేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. పైగా తెలుగును ఐచ్చిక భాషగా ఎంచుకున్న వారికి ఉత్తీర్ణతలో 5 పాయింట్లు అదనంగా కేటాయిస్తారు. ఈ నిర్ణయం ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి సంతోషాన్ని కలిగిస్తోంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో హిందీ, పంజాబీ, తమిళ భాషకు మాత్రమే గుర్తింపు ఉంది. తాజాగా ఆ జాబితాలో తెలుగు వచ్చి చేరింది. దీంతో ఆస్ట్రేలియాలో ఉన్న మన తెలుగు వారికి ప్రయోజనం కలగనుంది.  

Leave a Comment