కడుపులో టీ గ్లాస్.. ఎలా మింగేశావయ్య బాబూ..!

కడుపులో నొప్పి అంటూ వచ్చిన ఓ వ్యక్తికి స్కాన్ చేస్తే పొట్టలో టీ గ్లాస్ కనిపించింది. ఇది చూసి డాక్టర్లే షాక్ అయ్యారు. ఈ షాకింగ్ ఘటన బీహార్ లోని వైశాలి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల మేరకు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి కడుపు నొప్పి వస్తుందని డాక్టర్ మక్బూల్ హన్ అనే వైద్యుడి వద్దకు వెళ్లాడు. 

దీంతో వైద్యుడు అతడికి అల్ట్రాసౌండ్, ఎక్స్ రే తీయించారు. అందులో కడుపులో గ్లాస్ లాంటి ఆకారం కనిపించింది. అది కూడా పెద్ద పేగులో ఇరుక్కున్నట్లు ఉంది. దీని గురించి వైద్యుడు ఆ వ్యక్తిని అడిగాడు. టీ తాగుతూ గ్లాస్ మింగేశానని ఆ వ్యక్తి చెప్పాడు. అయితే ఆ వ్యక్తి మాటలను డాక్టర్ నమ్మలేదు. ఎందుకంటే ఆహార నాళం అంత వెడల్పుగా ఉండదు. అందుకే నోటి ద్వారా గ్లాసును మింగాడంటే నమ్మశక్యంగా లేదని డాక్టర్లు అభిప్రాయపడ్డారు. కేవలం మల విసర్జన మార్గం ద్వారనే అది లోపలికి చేరిందని అనుమానిస్తున్నారు. ఏం జరిగిందో చెప్పేందుకు రోగి ఇష్టపడటం లేదని వైద్యులు తెలిపారు.  

అయితే ఆ గ్లాసును ఎండోస్కోపిక్ ప్రక్రియలో పురీషనాళం ద్వారా బయటకు తీసేందుకు వైద్యులు ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. దీంతో ఆపరేషన్ చేసి పెద్ద పేగును కోసి గ్లాసును తీశారు. ప్రస్తుతం ఆ రోగి కోలుకుంటున్నాడు. అయితే పెద్దపేగుకు కుట్లు పడటంతో.. అవి మానడానికి చాలా సమయం పడుతుందని, అంతవరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.   

 

Leave a Comment