Tamanna Beauty Tip: ఉమ్మితో మొటిమలు మాయం అంటున్న మిల్కీ బ్యూటీ..!

దాదాపు 80 శాతం యువతీయుకులకు మొటిమలు వస్తాయి. వీటిని తగ్గించుకునేందుకు ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ఇక సెలబ్రెటీలు, హీరోయిన్స్ అయితే ఎన్నో రకాల ఉత్పత్తులు ఉపయోగిస్తారు. అయితే మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం ఓ షాకింగ్ విషయం చెప్పింది. మొటిమలు రాకుండా ఉమ్మి వాడుతానని చెప్పింది. 

తమన్నా ఇటీవల ఓ మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘నా స్కిన్ కేర్ ఐటమ్స్ లో మార్నింగ్ సెలైవాను వాడుతాను. ఉదయాన్నే లేచిన తర్వాత నా లాలాజలనం(సలైవా)ను అప్లయి చేస్తాను. అంతేకాదు సలైవా స్కిన్ ప్రాబ్లెమ్స్ క్లియర్ చేయడంలో బాగా పనిచేస్తుంది’ అని షాకింగ్ కామెంట్స్ చేసింది. కాగా, తమన్నా ప్రస్తుతం ఎఫ్-3, నితిన్ హీరోగా చేస్తున్న మ్యాస్ట్రో సినిమాల్లో నటిస్తోంది..

 

Leave a Comment