కొత్త పద్ధతిని కనిపెట్టిన శాస్త్రవేత్తలు.. ఈ రసంతో దోమలను ఈజీగా చంపేయవచ్చు..!

మలేరియా కారక దోమలను చంపేందుకు స్వీడిష్ శాస్త్రవేత్తలు కొత్త పద్ధతిని కనిపెట్టారు. స్వీడిష్ కంపెనీ మాలిక్యులర్ అట్రాక్షన్ చేసిన ఈ ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దోమలకు విషపూరిత దుంప రసం ఇచ్చి చంపేయవచ్చని పరిశోధనలో వెల్లడైంది. ఈ రసం మానవ రక్తంగా ఉంటుంది. దోమలు ఆ రసాన్ని తాగితే కొద్ది సేపటికే చచ్చిపోతాయి.. ప్రస్తుతం దోమలను నియంత్రించడం కష్టంగా మారింది. అయితే ఈ కొత్త ప్రయోగం ద్వారా మలేరియా వ్యాప్తి చేసే దోమలను చంపేయవచ్చని స్వీడిష్ కంపెనీ చెబుతోంది.

దోమలు ఎలా చనిపోతాయంటే:

మలేరియాతో బాధపడుతున్న రోగుల రక్తంలో HMBPP అణువును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అణువు ఒకరకమైన వాసనను ఇస్తుంది. ఈ వాసన ద్వారానే దోమలు ఆకర్షితమై మనిషి రక్తాన్ని తాగుతాయి. దోమలను చంపేందుకు శాస్త్రవేత్తలు ఇదే విధమైన ప్రయోగం చేశారు. మొక్క నుంచి HMBPP అణువును సేరకించారు. ఈ అణువును ప్రత్యేక విషంలో కలిపి దుంప రసంలో కలిపారు. 

ఈ రసానికి దోమలు ఆకర్షితమమై ఎక్కువగా తాగాయి. తాగిన కొద్ది సేపటికే దోమలన్నీ చనిపోయాయి. అయితే ఈ ద్రవం ఇతర జాతుల కీటకాలను ఆకర్షించదు. అందువల్లనే దోమలను చంపడానికి దీనిని ఉపయోగించారు. ఇతర హానికరమైన పురుగు మందులతో పోలిస్తే ఈ రసం చాలా తక్కువ మొత్తంలో అవసరం అవుతుంది. అయితే జికా, వెస్ట్ నైలు వైరస్, డెంగ్యూ, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధులకు ఈ మిశ్రమం పనిచేయదు..  

Leave a Comment