సుడిగాలి సుదీర్ ఆస్తుల విలువెంతో తెలుసా?

బుల్లి తెరపై ఓ రేంజిలో క్రేజ్ సంపాదించుకున్న నటుడు సుడిగాలి సుధీర్. సుడిగాలి సుదీర్ సుధీర్ జీవితం ఒకప్పుడు ఓ సాధారణ మెజీషియన్ గా ఉన్నా  ఎన్నోఇబ్బందులు పడ్డాడు.

తినడానికి తిండి లేక, ఖాళీకడుపుతో పడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి అంటాడు ఈ నటుడు.

 

ప్రస్తుతం చక్కటి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు అంతేకాదు హీరోగా మారి సినిమాలు కూడా చేశాడు సుడిగాలి సుదీర్ఎదుగుదల వెనుకల ఎంతో శ్రమ ఉంది. ఒకప్పుడు జిల్లా స్థాయిలో ఉన్న సుధీర్ ప్రస్తుతం కమెడియన్గా, యాంకర్ ,గా హీరోగా, సత్తా చాటుకున్నాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే విధంగా డబ్బులు కూడా బాగానే సంపాదిస్తున్నాడు.

 

జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుదీర్. గడిచిన ఏడు సంవత్సరాలుగా చక్కటి కామెడీతో జనాలను నవ్విస్తున్నాడు .ఆయన టీం చేసే కామెడీ ని చూసి రెండు తెలుగు రాష్ట్రాల్లో నవ్వని జనాలు లేదని చెప్పుకోవచ్చు.కొన్ని రోజుల క్రితం సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమాలో హీరోగా నటించి జనాలను ఆకట్టుకున్నాడు. అటు పలు సినిమాల్లో చిన్న చిన్న అందరినీ అలరిస్తూ ఉంటాడు.

ప్రస్తుతం బుల్లితెర తో పాటు వెండితెరపై నా దుమ్మురేపుతున్న డు సుడిగాలి సుదీర్. అటు రెమ్యూనరేషన్ విషయంలోనూ బాగా డిమాండ్ బాగానే ఉన్నాడు సుడిగాలి సుధీర్.

ఈ గడిచిన ఏడు సంవత్సరాలలో ఆయన బాగానే ఆస్తులు కూడబెట్టిన ట్లు తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్ లో సుధీర్ ఓ ప్రాపర్టీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆస్తుల విలువ సుమారు ఐదు కోట్లు ఉంటుందన్న  సమాచారం. ఏడాదికి సుమారు 40 లక్షల రూపాయల వరకూ సంపాదిస్తున్న ట్లు తెలుస్తోంది .ఈ డబ్బులతో హైదరాబాద్లో ఆస్తులు కుంటున్నట్లు టాక్.

ఇప్పటికే తనకు భాగ్యనగరంలో రెండు ఇళ్లు ఉన్నాయి. స్థిరాస్తులు కూడా బాగానే కూడా పెట్టుకున్నాడట. ఒకప్పుడు తిండి కోసం తిప్పలు పడ్డ సుధీర్ ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోవడం తోటి నటులు చాలా సంతోషంగా  ఫీల్ అవుతున్నారట.

 

Leave a Comment