మాట నిలబెట్టుకున్నాడు.. సాఫ్ట్ వేర్ శారదాకు సోను సూద్ జాబ్ ఆఫర్ లెటర్..!

కరోనా లాక్ డౌన్ కారణంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోల్పోయి కూరగాయల అమ్ముకుంటు ఆదర్శంగా నిలిచిన శారదాకు సాయం చేస్తానని ఇచ్చిన మాటను సోనుసూద్ నిలబెట్టుకున్నాడు. ఈ మేరకు ఆమెకు జాబ్ ఆఫ్ లెటర్ అందించినట్లు సోను సూద్ చెప్పారు. ఈ విషయన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘మా ప్రతినిధి శారదాను కలిశారు. ఇంటర్వ్యూ పూర్తయింది. జాబ్ లెటర్ కూడా పంపించాం. జై హింద్’ అంటూ ట్వీట్ చేశారు.  

కరోనా లాక్ డౌన్ కారణంగా శారదాను సాఫ్ట్ వేర్ కంపెనీ ఇంటికి పంపించింది. దీంతో ఆమె కూరగాయల వ్యాపారం చేసుకుంటూ తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటుంది. ఈ విషయం కాస్తా వైరల్ అయి సోను సూద్ వద్దకు చేరింది. దీంతో సోనూసూద్ శారదాకు చేయూత అందించాడు. సోను సూద్ నుంచి తనకు సహాయం అందిందని టెక్కీ శారద స్పష్టం చేశారు.  

Leave a Comment