బీహార్ లో సీఎం అభ్యర్థిపై చెప్పులు..!

ఆర్జేడీ నే, వివక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ పై ఆగంతకులు చెప్పులు విసిరారు. ఓరంగాబాద్ జిల్లాలోని కుతుంబ అసెంబ్లీ నియోజవర్గంలో మంగళవారం ఆయన ప్రచారానికి వచ్చారు. సభా వేదికపై ఆయన కూర్చొని ఉండగా ఆకస్మాత్తుగా ఆయన వైపు రెండు చెప్పులు వచ్చి పడ్డాయి. ఇక చెప్పు ఆయన తల పక్క నుంచి వెళ్లిపోగా, మరొకటి తేజస్వీకి తగిలి ఆయన ఒడిలో పడింది.  దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోది.

అయితే చెప్పులు విసిరిన వారు ఎవరు..ఎందుకు విసిరారా అనే వివరాలు మాత్రం తెలియలేదు. తేజస్వీ మాత్రం ఆయన ప్రసంగంలో ఈ ప్రస్తావనే తీసుకురాలేదు. ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ మాత్రం ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఎన్నికలు ముగిసే వరకు విపక్ష నేతలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. 

Leave a Comment