పోలీసు ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ లో నోటిఫికేషన్ : సీఎం జగన్

నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ అందించారు. పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసి జనవరిలో ఉద్యోగాల భర్తీకి షెడ్యూల్ జారీ చేస్తామని వెల్లడించారు. నాలుగు దశలలో ఏటా 6500 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే విధంగా గత మూడు సంవత్సరాలుగా పోలీస్ సంక్షేమ నిధికి ఇవ్వాల్సిన నిధులను కూడా విడుదల చేస్తామన్నారు. 

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని పోలీసు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీసులపై రచించిన ‘అమరులు వారు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పోలీసు అమరవీరుల త్యాగాలను 61 ఏళ్లుగా గుర్తు చేసుకుంటున్నామని, విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిని ప్రతి పోలీసుకు, ఆ కుటుంబానికి మన సమాజం జేజేలు పలుకుతుందని సీఎం జగన్ చెప్పారు.

Leave a Comment