కరోనాకు సమర్థవంతమైన ఔషధం..పరిశోధనల్లో కీలక పురోగతి..!

కరోనా వైరస్ ను కట్టడి చేసే మందు కోసం ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేతలు కఠోర శ్రమ చేస్తున్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ చికిత్స కోసం ఔషధాలపై ప్రయోగాలు చేస్తునే ఉన్నారు. ఇందులో బాగంగా బ్రిటన్, జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు మరో పురోగతిని సాధించారు. కరోనా వైరస్ పునరుత్పత్తిని అణచివేసే సామర్థ్యమున్న ఔషధాన్ని గుర్తించారు. 

బ్రిటన్ కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కెంట్ తో పాటు జర్మనీకి చెందిన గైథే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా కరోనా వైరస్ సోకినప్పుడు కణాల్లో అది ఎలాంటి చర్యలు, ప్రభావాన్ని చూపుతుందనే విషయంపై దృష్టి సారించారు. ఈ పరిశోధనల్లో పెంటోజ్ ఫాస్పేట్ అనే జీవక్రయా మార్గం క్రియాశీలంగా మారినప్పుడు మాత్రమే సార్స్ కోవ్-2 కణాల పునరుత్పత్తి వేగంగా జరుగుతున్నట్లు గుర్తించారు. వీటిని అణచి వేయడంలో బెన్ ఫో – ఆక్సిథియామిన్ ఔషధం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని ద్వారా ఇన్ఫెక్షన్ కు గురి అయిన కణాలు కొవిడ్ కణాలను ఉత్పత్తిని తగ్గించవచ్చని నిర్ధారణకు వచ్చారు. 

 వైరల్ వ్యాధుల చికిత్సకు రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేయడమే అత్యంత ప్రధాన సమస్య. కావున విభిన్న లక్ష్యాలతో వీటిపై పరిశోధనలు చేయడం ఎంతో ముఖ్యం. సమర్థవంతమైన కరోనా వైరస్ చికిత్స అభివృద్ధి చేయడంలో ఈ పరిశోధన కీలక పురోగతిని సాధించిందని యూనివర్సిటీ ఆఫ్ కెంట్ ప్రొఫెసర్ మార్టిన్ మిషెలీస్ తెలిపారు. రాబోయే రోజుల్లో కరోనా చికిత్సా విధానంపై మరింత పురోగతిని సాధిస్తామని ఆయన అభిప్రాయపడ్డారు. 

 

Leave a Comment