‘మీలాగా పవన్ కళ్యాణ్ అడుక్కోరు.. మెగా బెగ్గింగ్ చూసి హర్ట్ అయ్యా’ : ఆర్జీవీ

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు గురువారం భేటి అయిన సంగతి తెలిసిందే.. ఈ భేటిలో రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారంతో పాటు 17 అంశాలపై చర్చించారు. దీనికి సీఎం జగన్ కూడా సానుకూలంగా స్పందించారు. రాబోయే రెండు వారాల్లో ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.

అయితే ఏపీలో సినిమా టికెట్ రేట్ల వ్యవహారంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అగ్రెసీవ్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. గురువారం సినీ పెద్దల భేటీపై కూడా ఆయన స్పందించారు. మెగాస్టార్ చిరుపై సెటైర్లు వేశారు. ‘ఓ మెగా ఫ్యాన్ గా ఈ మెగా బెగ్గింగ్ చూసి చాలా బాధపడ్డా’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.  ‘చిరంజీవి గారు.. మీలాగా మీ సోదరుడు పవన్ ఎప్పటికీ ఒకర్ని అడుక్కోరు.. మీకంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ ఆదరణ పొందడానికి కారణం అదే. మెగా అభిమానులు కూడా మిమ్మల్ని ఇష్టపడరు’ అని మరో ట్వీట్ చేశారు. 

 

Leave a Comment