కరోనాతో రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి..!

ఆనందయ్య మందు తీసుకున్న తర్వాత కోలుకుంటున్నట్లుగా చెప్పిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మరణించారు. కరోనాతో వారం రోజుల నుంచి నెల్లూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు. కోట మండలం తిన్నెలపొడికి చెందిన కోటయ్య ఆనందయ్య మందుతో కోలుకున్నానన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆనందయ్య కరోనా మందుకు బాగా క్రేజ్ వచ్చింది..    

దాదాపు మరణం అంచులకు వెళ్లి ఆనందయ్య మందుతో తిరిగి వచ్చానని కొన ఊపిరితో ఉన్న ఇంకా రెండు నిమిషాలు ఆగితే ఆక్సిజన్ లేకపోతే చనిపోతా.. కంటిలో ఆనందయ్య మందు వేశారు. కొద్ది నిమిషాల్లో కోలుకున్నానని, ఆనందయ్య మందు చాలా అద్భుతమని కోటయ్య ఆ వీడియోలో తెలిపారు. 

అయితే కంట్లో చుక్కలు వేసుకున్న వారం రోజులకు కోటయ్య ఆరోగ్యం క్షీనించింది. దీంతో ఆయన్ను కోట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం 22న నెల్లూరు జీజీహెచ్ కి తరలించారు. ఆక్కడ చికిత్స పొందుతూ కోటయ్య మృతి చెందారు. చికిత్స పొందుతూ కోటయ్య చనిపోవడంతో ఆనందయ్య మందుపై ఎన్నో సందేహాలు నెలకొన్నాయి.  

Leave a Comment