రెడ్ జోన్లలో ఆంక్షలు కఠినం

రెండు గజాల దూరం మంత్రం కావాలి

మాస్కులు జీవితంలో బాగం కావాలి

సీఎంల సమావేశంలో ప్రధాని మోడీ

హాట్  స్పాట్ మరియు రెడ్ జోన్లలో ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని, రెడ్ జోన్లను ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా మార్చేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలు కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. కరోనా వైరస్ నియంత్రణ, లాక్ డౌన్ పొడిగింపు గురించి తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 ఈ సమావేశంలోఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల గురించి సీఎంలు ప్రస్తావించారు. జోన్లుగా విభజించి సడలింపు ఇవ్వాలని కొందరు సీఎంలు వివరించారు. గ్రీన్ జోన్లలో పూర్తి సడలింపు ఇవ్వాలన్నారు. రెడ్ జోన్లలో లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి సూచించారు. 

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ..ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇస్తూనే కోవిడ్-19తో పోరాడాలని చెప్పారు. ‘దో గజ్ దూరీ’(2 అడుగుల దూరం) మంత్రాన్ని అనుసరించాలని, రాబోయే రోజుల్లో మాస్కులు మన జీవితంలో ఒక భాగం కావాలని మోడీ అన్నారు. లాక్ డౌన్ నుంచి నిష్క్రమించడానికి ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో తొమ్మిది మంది ముఖ్యమంత్రులలో ఐదుగురు లాక్ డౌన్ ముగించాలని చెప్పారు. మిగిలిన వారు కోవిడ్-19 వ్యాప్తిని నియంత్రించేందుకు లాక్ డౌన్ విస్తరించాలని తెలిపారు. 

 

Leave a Comment