దేశంలో ఇదొక్కటే సమస్య ఉందా ? : సీఎం కేసీఆర్

సీఏఏను వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం

పౌరసత్వ సవరణ చట్టంను వ్యతిరేకిస్తూ సోమవారం తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. తీర్మానంపై సుదీర్ఘంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ సీఏఏను ఎందుకు వ్యతిరేకిస్తున్నామో వివరించారు. దేశంలోని కోట్లాది మందిని ఇబ్బందులకు గురి చేసే ఈ చట్ట సవరణ అంతర్జాతీయంగా కూడా దేశ ప్రతిష్టను మంట గలుపుతోందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అందుకే సీఏఏను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. దేశంలో చాలా మంది పేదలకు బర్త్ సర్టిఫికెట్ లేదని, తనకూ బర్త్ సర్టిఫికెట్ లేదని ఆయన అన్నారు. 

జాతీయ పౌరసత్వంపై గత కొద్ది రోజులుగా అనేక వర్గాలు వారి పద్ధతుల్లో నిరసనలు చేశారన్నారు. ఇప్పటికే పార్లమెంట్లో తమ నిర్ణయం చెప్పామన్నారు. దేశంలోని ఏడు రాష్ట్రాలు సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశాయన్నారు. దేశ వ్యాప్తంగా దీన్ని వ్యతిరేకించారున్నారు. దీన్ని పున:సమీకరించమని చెప్పామన్నారు. అందుకే సీఏఏను వ్యతిరేకిస్తూ సభలో తీర్మానం పెట్టామనన్నారు. సీఏఏ బిల్లు తీవ్ర ఆందోళన సృష్టిస్తోందని, గుడ్డిగా తాము సీఏఏను వ్యతిరేకించడం లేదని, అన్ని అర్థం చేసుకుని పూర్తిగా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని సీఎం కేసీఆర్ స్ఫష్టం చేశారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఢిల్లీ పర్యటన సందర్భంగా అదే నగరంలో అనేక మంది చనిపోయారని, కేంద్ర నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ దేశానికి కొత్తగా సీఏఏ చట్టం అవసరం లేదని, రాక్షసానందం పొందుతూ ఈ యాక్ట్ చేయనవసరం లేదని అన్నారు. ఏదో కొంపలు మునిగినట్లు ఇదొక్కటే సమస్య అన్నట్లుగా కేంద్రం ప్రవర్తిస్తుందని, ఇది హిందూ ముస్లిం సమస్య కాదు దేశ సమస్య అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. దేశంలో కోట్ల మంది పేదలకు బర్త్ సర్టిఫికెట్ లేదని, అందులో తాను ఒకడినని, తమ లాంటి వారి పరిస్థితి ఏంటనే విషయంపై కేంద్రం సమాధానం చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. 

Leave a Comment