వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Health tips in summer 

వేసవి వచ్చేసింది. ఎండ భగభగ మండిపోతోంది. మార్చి నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. అయితే మనలో చాలా మందికి వేసవిలో అధిక ఎండ వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ వేసవిలో ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహారం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. వేసవి అధిక ఉష్ణోగ్రతల వల్ల కలుషితమైన నీరు, ఆహారం వల్ల, వేడిని అధికమించడానికి తీసుకునే శీతల పానీయాల వల్ల పిల్లలు ఈ కాలం అనారోగ్యానికి గురవుతుంటారు. అలా కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వెచ్చని వాతావరణంలో మన చర్మ సంరక్షణ కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా చర్మంపై టాన్స్ రావడం జరుగుతుంది. ఈ వేసవిలో సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని చిట్కాలను తెలియజేస్తున్నాము. 

Summer health tips

చర్మ సంరక్షణకు సన్ స్క్రీన్ లోషన్..

మీ చర్మాన్ని హానికరమైన UV కిరణాల నుండి రక్షించుకోవడానికి కనీసం SPF 30 లేదా 50 సన్ స్క్రీన్ లోషన్ ను వాడాడటం చాలా ముఖ్యం. సున్నితమైన చర్మం కోసం, ఖనిజ ఆధారిత సన్‌స్క్రీన్ ఉత్తమమైంది. UV రేడియేషన్‌ను తగ్గించడానికి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండలో కూర్చోకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఒకవేళ ఎండలో ఎక్కువ సమయం తిరగాల్సి వస్తే ప్రతి రెండు గంటలకు లేదా ఈతకు వెళ్లివచ్చిన వెంటనే సన్ స్క్రీన్ లోషన్ మళ్లీ రాయాలి. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే కళ్ల సంరక్షణ కోసం సన్ గ్లాసెస్ వాడటం, తలపై టోపీ ధరించడం మంచిది. 

నీరు పుష్కలంగా త్రాగాలి..

వేసవిలో చెమట ఎక్కువగావ వస్తుంది. వేడి మరియు చెమట మీ శరీరాన్ని డీహైడ్రేషన్ కు గురిచేస్తాయి. మీ శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా రోజుకు కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గ్లాసుల నీరు తాగడం ఉత్తమం. ఇది మీ శరీరానికి డీహైడ్రేషన్ కు గురికాకుండా చేస్తుంది. నీటి కొరత శరీరానికి చాలా హానికరం. 

ఈ వేసవిలో కొబ్బరి బొండాలు, తాటిముంజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి బొండాలు కాస్త రేటు ఎక్కువైనా తర్వాత హాస్పిటల్స్, మందుల ఖర్చుతో పోలిస్తే వీటికి పెట్టే ఖర్చు తక్కువే. కొబ్బరి నీళ్లలో అనేక పోషకాలు ఉన్నాయి. అధిక ఉష్ణగ్రతలను తగ్గిస్తుంది. కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్ కలుపుకుని తాగితే వేసవి బడలిక, నీరసం చాలా త్వరగా తగ్గపోతుంది. 

Summer health tips..

చర్మాన్ని మృదువుగా ఉంచండి..

వేసవి అంటే చనిపోయిన చర్మ కణాల పెరుగుదల కాబట్టి మీ చర్మాన్ని మృదువుగా మరియు సిల్కీగా ఉంచడానికి ఎక్స్‌ఫోలియేట్ చేయడం చాలా ముఖ్యం. వేసవి చర్మం ప్రకాశవంతంగా చేయడానికి మీరు ఖరీదైన ఉత్పత్తులను కొనవలసిన అవసరం లేదు. తేలికపాటి స్క్రబ్ కోసం లోఫర్‌ను వాడండి లేదా ఓట్ మీల్, పాలు మరియు పెరుగులను ఉపయోగించి మీ స్వంత ఎక్స్‌ఫోలియేషన్ లోషన్ తయారు చేసుకోండి. 

వ్యాయామ పాలన కొనసాగించండి

పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రత కారణంగా వేసవిలో వ్యాయామాన్ని ఆపాల్సిన పనిలేదు. మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.  దీని కోసం మీ వ్యాయామ ప్రణాళికలను మార్చుకోండి. ఇంటి వద్ద చేసుకునే వ్యాయామాలను ప్రయత్నించండి. ఎండ తగ్గాక వాకింగ్, జాగింగ్ లాంటి తేలిక వ్యాయామాలు చేయండి. అయితే వ్యాయామం చేసినప్పుడు తగినంత నీరు తాగడం మంచిది. లేకపోతే మీ శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. ప్రతి రోజు 10 నిమిషాలు ఈత కొట్టండి. ఇది శరీరానికి మంచి వ్యాయామం. 

మీ జుట్టును రక్షించండి

వేసవిలో జుట్టు విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. స్థిరమైన వేడి, సూర్యరశ్మి మరియు క్లోరిన్ మన వెంట్రుకలను దెబ్బతీస్తాయి. మరియు సెలవుల తర్వాత లింప్ మరియు నిస్తేజంగా అనిపిస్తుంది. తేమను తిరిగి జోడించడానికి కండిషనింగ్ చికిత్సను ఉపయోగించే ముందు, క్లోరిన్ మరియు ఏదైనా అదనపు ఉత్పత్తి లేదా సన్ క్రీమ్‌ను తొలగించడానికి స్పష్టమైన షాంపూని ప్రయత్నించండి. మీకు వీలైతే, వేడి స్టైలింగ్‌ను నివారించండి.

వేసవి చిట్కాలు.. 

Summer health tips

  • ఆహార పదార్థాలలో నూనె తగ్గించి వాడడం మేలు. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. 
  • ఉదయం పూట నూనె వంటలు కాకుండా, ఆవిరి కుడుములు ఇడ్లీలు ఆరోగ్యకరం.
  • కర్బూజాలు ఎక్కవగా తీసుకోవాలి. ఇందులో 90 శాతం నీరు ఉంటుంది కాబట్టి శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా చేస్తుంది. 
  • మజ్జిగ అన్నంలో మామిడి పండ్లు తింటే విటమిన్ ఎ, డీలు ఎక్కువగా శరీరానికి అందుతాయి. 
  • కూల్ డ్రింక్స్ కంటే కొబ్బరి నీళ్లు చాలా మంచివి. కాఫీ, టీలకు వీలైనంత దూరంగా ఉండండి.
  • పిల్లలు వేసవి సెలవుల్లో ఎండలోకి వెళ్లి, ఆటలు ఆడుతారు. అలా ఎండలోకి వెళ్లనీయకుండా ఇండోర్ గేమ్స్ ప్లాన్ చేయండి. 
  • పలుచని మజ్జిగలో కాసింత నిమ్మ లేదా డబ్బాకులు వేసి ఉప్పు వేసుకుని పలుచగా కలిపి తాగితే ఆరోగ్యానికి మంచిది. వేసవిలో బయట జ్యూస్ లు ఎక్కువగా తీసుకోకుండా ఇంట్లో అన్ని రకాల పండ్లతో మరియు కూరగాయలతో జ్యూస్ లు చేసుకొని తాగాలి. 

 

Leave a Comment