రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి అరెస్టు..!

ప్రముఖ న్యూస్ ఛానెల్ రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై, రాయ్ గడ్ పోలీసులు అరెస్టు చేశారు. రెండేళ్ల క్రితం డిజైనర్ ఆత్మహత్యకు పురికొల్పారనే ఆరోపణల నేపథ్యంలో అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు చెప్పారు. విచారణ నిమితం అర్నాబ్ ను రాయగడ్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది. 

ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ఆత్మహత్యకు సంబంధించి అర్నాబ్ ను అదుపులోకి తీసుకున్నట్లు రిపబ్లిక్ టీవీ నివేదించింది. ఆయనపై ఐపీసీ సెక్షన్ 306 కింద అభియోగాలు మోపారని, కనీసం 20 మంది పోలీసులు అర్నాబ్ ను అరెస్టు చేశారని చెప్పింది. బుధవారం ఉదయం తమ ఇంటిపై పోలీసులు దాడి చేసి అర్నాబ్ ను కొట్టారని, జుట్టు పట్టి లాక్కెళ్లారని అర్నాబ్ భార్య సమ్యబ్రాతా రే ఆరోపించారు. అర్నాబ్ ను వ్యాన్ లోకి నెట్టి తీసుకెళ్లారు.  

కాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు అనంతరం ముంబై పోలీసులపై, బాలీవుడ్ పై, మహారాష్ట్ర ప్రభుత్వంపై అర్నాబ్ వరుసగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అర్నాబ్ పెద్ద టీఆర్పీ కుంభకోణానికి పాల్పడ్డారని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాజాగా ఒక పాత కేసులో అర్నాబ్ ను పోలీసులు అరెస్టు చేశారు. 

Leave a Comment