అంబేద్కర్  స్మృతివనం నమూనా ఫొటోలు ఇవే..!

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం  వద్ద లైబ్రరీ, మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. విజయవాడలోని అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై సీఎం వైయస్‌.జగన్ సమీక్ష నిర్వహించారు.

మ్యూజియంలో అంబేద్కర్ జీవి విశేషాలను, ఆయన ప్రవచించిన సూక్తులను ప్రదర్శించాలని నిర్దేశించారు. అదే విధంగా పార్కు వద్ద రహదారిని విస్తరించి, ఫుట్ పాత్ ను కూడా అభివృద్ధి చేయాలన్నారు. 

ఈ సందర్భంగా భారీ అంబేద్కర్ విగ్రహం, స్మృతివనంకు సంబంధించి రెండు రకాల ప్లాన్లను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం జగన్ కు వివరించారు. అంబేద్కర్ కాంస్య విగ్రహం తయారీకి 14 నెలల సమయం పడుతుందని అధికారులు పేర్కొన్నారు.

2022 ఏప్రిల్14న అంబేడ్కర్‌ జయంతి రోజున విగ్రహావిష్కరణ, స్మృతివనం ప్రారంభించాలని, స్మృతివనం వద్ద అంబేద్కర్‌కు సంబంధించి అనేక అంశాలు ప్రదర్శనకు పెట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

కన్వెన్షన్‌ సెంటర్‌, పబ్లిక్‌ గార్డెన్‌, ధ్యానస్థూపం, బౌద్ద శిల్పాలు ఏర్పాటు, అదే విధంగా రెస్టారెంట్‌, లాబీ, ధ్యానకేంద్రం, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకర్స్ ట్రాక్‌, పౌంటెయిన్సూ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

 

Leave a Comment