కాలేయం పాడైపోవడానికి కారణం ఈ అలవాట్లే..తస్మాత్ జాగ్రత్త

మన శరీరంలో కాలేయం ముఖ్యమైన భాగం. కాలేయంలోనే విటమిన్లు, ఖనిజాలనేవి నిల్వ ఉంటాయి. మన శరీరం యాక్టీవ్ గా ఉండాలన్నా, పనితీరు బాగా ఉండాలన్నా కాలేయం బాగుండాలి. మనం తినేటటువంటి ఆహార పదార్థాలు, తాగే పానీయాలు ఇంకా మన అలవాట్లే మన కాలేయ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. అందుకే కొన్నిచెడు అలవాట్ల నుంచి కాలేయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉంది. మరి ఆ చెడు అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నీళ్లు సరిపడనంత వరకూ తాగండి: నీళ్లు మన శరీరాన్ని డిటాక్సిఫై చేస్తాయి. కాలేయానికి తగినంత హైడ్రేషన్ అనేది అవసరం అవుతుంది. మీరు తక్కువ నీరు తాగితే అది కాలేయ సమస్యలకు అనేక విధాలుగా దారితీస్తుంది. అంతేకాకుండా నీటిని కనుక ఎక్కువగా తీసుకుంటే కాలేయం దృఢంగా, బలంగా ఉంటుంది.

ఈ రోజుల్లో ఆల్కాహాల్ అనేది చాలా కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతోంది. ఒక వ్యక్తికి సమస్య వస్తే మందు తాగడాన్ని అలవాటుగా చేసుకుంటున్నాడు. దీని వల్ల కాలేయం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అధికంగా ఆల్కాహాల్ తాగే వారిలో అధిక మంట సిర్రోసిస్ కాలేయ వ్యాధికి కారకం కావచ్చు.

పొగ తాగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. పొగ తాగే అలవాటు ఉన్నవారిలో కాలేయ క్యాన్సర్ వచ్చే సంకేతాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. సిగరెట్ పొగ పీల్చడం వలన కాలేయంపై ఆక్సీకరణ ఒత్తిడి పెంచి దెబ్బతినేలా చేస్తుంది.

అధిక బరువు ఉన్న వ్యక్తి శరీరంలో అదనపు కొవ్వు కణాలు ఎక్కువగా ఉండటంతో వారు ఊబకాయం బారిన పడే అవకాశం ఉంటుంది. ఊబకాయం వల్ల కాలేయ కణజాలం దెబ్బతీసే విషపూరిత ప్రోటీన్లు అనేవి శరీరంలో విడుదల అవుతాయి. అందుకే మితంగా తినడం మంచిది. అధికంగా చక్కెర పదార్థాలు తినడం చాలా ప్రమాదం. ఎక్కువగా చక్కెర పదార్థాలు తినడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది.

మనం రాత్రి సమయాల్లో తక్కువగా తినడం ఎంతో మంచిది. కాలేయం తన పనిని ఎక్కువగా రాత్రి టైంలోనే చేయడం వల్ల పడుకునే ముందు ఎక్కువగా అన్నం తినకపోవడం మంచిది. ఒక వేళ ఎక్కువగా భోజనం తింటే అది కాలేయంపై అదనపు ఒత్తిడి పడేలా చేస్తుంది. అందుకే రాత్రి సమయంలో అతిగా తినడం తగ్గించాలి.

సురక్షితం కానటువంటి లైంగిక సంబంధాలు ఉన్నవారిలో కాలేయం దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెపటైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది కాలేయం దెబ్బతినడానికి ఎక్కువగా చూస్తుంది.

మానసిక ఒత్తిడితో ఎక్కువగా బాధపడేవారికి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇలా బాధపడుతున్న వ్యక్తిలో కాలేయం దెబ్బతింటుంది. తరచుగా ఒత్తిడి లేదా కోపాన్ని చూపించడం వలన కాలేయానికి ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.

చాలా మంది వ్యక్తులు కొలెస్ట్రాల్, రక్తపోటు సమస్యలతో బాధపడుతుంటారు. గుండె సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నవారిలో కాలేయ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆల్కాహాల్ తాగుతున్నవారికి కాలేయ పరీక్షలు ఎంతో అవసరం అనే విషయాన్ని గ్రహించాలి.

నిద్ర సరిగా పోకపోవడం వల్ల కూడా కాలేయంలో ఆక్సీకరణ ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రతి రోజూ రాత్రికి కనీసం ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూడాలి. ఇలా చేయకుంటే కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

Leave a Comment