వీడియో కాన్ఫరెన్సింగ్ లో రిలయన్స్ జియో.. JioMeet లాంచ్

Reliance Jio వీడియో కాన్ఫరెన్సింగ్ లోకి అడుగుపెట్టింది. JioMeet అనే కొత్త ప్లాట్ పామ్ ను త్వరలో లాంచ్ చేయనుంది. ఇది ఎలాంటి డివైస్ లోనైనా, ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా పని చేయగల సామర్థ్యం  కలిగి ఉందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సీనియర్ విపి పంకజ్ పవార్ తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం తన ఆర్థిక నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తన జియో ప్లాట్ ఫాంల అనుబంధ సంస్థ కింద JioMeetను దేశవ్యాప్తంగా వీడియో ప్లాట్ ఫాంగా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. 

Lockdown సమయంలో గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ మరియు జూమ్ వంటి ప్లాట్ ఫామ్ లు బాగా ప్రాచుర్యం పొందాయి. వీటికి పోటీగా రిలయన్స్ జియో JioMeet ప్లాట్ ఫాంను తీసుకొచ్చింది. ఈ యాప్ ను రిలయన్స్ ఎప్పుడో ప్రారంభించింది. అయితే ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది. JioMeet ను ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ మరియు మాకోస్ లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందులో వినియోగదారులు ఇమెయిల్ మరియు పాస్ వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. 

JioMeet ఉచిత ప్లాన్ లో ఐదుగురు వినియోగదారులకు మద్దతు ఇస్తుంది. మరియు దాని వ్యాపార ప్రణాళిక సమయంలో 100 మంది వీడియో కాన్ఫరెన్సింగ్ లో భాగం కావచ్చు. జియో వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీస్ లో సాధారణ కాన్ఫరెన్స్ లింక్ సహాయంతో యూజర్స్ ను ఆహ్వానించవ్చు. క్రోమ్ బ్రౌజర్ సహాయంతో వినియోగదారులు సమావేశాల్లో చేరవచ్చు. వినియోగదారులు ఆడియో లేదా వీడియో మోడ్ లో కూగా టోగుల్ చేయవచ్చు. 

ఈ సమావేశాలు పిన్ ప్రొటెక్టెడ్ అని రిలయన్స్ జియో చెప్పింది. ఇది తక్కువ నెట్ వర్క్ జోన్ లో ఉన్నప్పటికీ కాల్ డ్రాప్ కాదని, తక్కువ నెట్ వర్క్ ఉన్నప్పుడు లాక్ స్వయంచాలకంగా డౌన్ గ్రేడ్ అవుతుందని కంపెనీ తెలిపింది. 

 

Leave a Comment