తెలుగు రాష్ట్రాల్లో రెడ్ జోన్లు ఇవే..

దేశంలో మొత్తం 130 రెడ్ జోన్లు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.  ఆరెంజ్ జోన్ లో 284, గ్రీన్ జోన్ లో 319 జిల్లాలు ఉన్నాయి. పలు రాష్ట్రా విజ్ఞప్తి మేరకు జోన్లలో మార్పులు చేసినట్లు కేంద్ర హోం శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ పేర్కొన్నారు. దేశంలో రెడ్ జోన్లలో అత్యధికంగా యూపీలోని 19 జిల్లాలు, మహారాష్ట్రలో 14 జిల్లాలు, తమిళనాడులో 12, ఢిల్లీలో 11, బెంగాల్ లో 10 ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. 

ఆంధ్రప్రదేశ్ లో జోన్ల వివరాలు..

ఏపీలో రెడ్ జోన్ లో 5, ఆరెంజ్ జోన్ లో 7, గ్రీన్ జోన్ లో 1 జిల్లా ఉంది. 

రెడ్ జోన్ జిల్లాలు – కర్నూలు, గుంటూరు, కృష్ణ, నెల్లూరు, చిత్తూరు

ఆరెంజ్ జోన్ జిల్లాలు – తూర్పూగోదావరి, పశ్చిమ గోదావరి, కడప అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖ

గ్రీన్ జోన్ జిల్లాలు – విజయనగరం

తెలంగాణలో జోన్ల వివరాలు

తెలంగాణలో రెడ్ జోన్లో 6 జిల్లాలు, ఆరెంజ్ జోన్ లో 18, గ్రీన్ జోన్ లో 9 జిల్లాలు ఉన్నాయి. 

రెడ్ జోన్ జిల్లాలు – హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, వరంగల్ అర్బన్

ఆరెంజ్ నోజ్ జిల్లాలు – నిజామాబాద్, జోగులాంబ గద్వాల్, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, కొమరం భీం, అసిఫాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భోపాలపల్లి, మెదక్, జనగాం, నారాయణపేట

గ్రీన్ జోన్ జిల్లాలు – పెద్దపల్లి, నాగర్ కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి

Leave a Comment