‘కరోనా అంతానికి హనుమాన్ చాలీసా పఠించండి’

నిత్యం వివాదాల్లో ఉండే బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కరోనా పోరాడేందుకు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని తెలుసు. దీని వైరస్ కనుగొనేందుకు ప్రపంచ దేశాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరుణంగా హనుమాన్ చాలీసాను పఠిస్తే కరోనా వైరస్ అంతం అవుతుందని, వ్యాక్సిన్, మందులు అవసరం లేదని ప్రగ్యా సింగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. 

ఈ మేరకు ఆమె శనివారం ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘కరోనా వైరస్ మహమ్మారిని అంతం చేయడానికి ఆధ్యాత్మిక ప్రయత్నం చేద్దాం. జూలై 25 నుంచి ఆగస్టు 5 వరకు ఇంట్లో రోజుకు ఐదు సార్లు హనుమాన్ ఛాలీసా పఠించండి. ఆగస్టు 25న దీపాలను వెలిగించి, ఇంట్లో శ్రీరాముడికి ఆర్తి అర్పించండి. దేశవ్యాప్తంగా ఉన్న హిందూవులు హనుమాన్ చాలీసాను ఒకే స్వరంలో పఠిస్తే కరోనా వైరస్ నుంచి విముక్తి పొందవచ్చు. అది శ్రీరాముడికి చేసే ప్రార్థన’ అని బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ చెప్పుకొచ్చారు. ఆగస్టు 4న భోపాల్ లో లాక్ డౌన్ ముగుస్తుందని, అదే రోజు హనుమాన్ చాలీసా పఠనం కూడా పూర్తవుతుందని అన్నారు. ఆగస్టు 5న అయోధ్యలో రామాలయానికి భూమి పూజ జరుగుతుందని, ఆ రోజులు ఒక పండుగలా జరుపుకుందామని ఆమె పిలుపునిచ్చారు. 

 

Leave a Comment