రానా బర్త్ డే.. ఫస్ట్ లుక్ విడుదల..!

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి సోమవారం పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా రానా కొత్త చిత్రం ‘విరాట పర్వం’ ఫస్ట్ లుక్ ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ సినమాలో రానా కామ్రేడ్ రవి అన్నగా నటిస్తున్నాడు. 

ఈ ఫస్ట్ లుక్ లో రానా చేతిలో గన్ పట్టకుని ఉన్నాడు. ఈ సినిమాను వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నివేదా పెతురాజ్, ప్రియమణి, సందితాదాస్, నవీన్ చంద్ర, జరీనా, వహాబ్, ఈశ్వరీరావ్, సాయిచంద్, బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సాయిపల్లవి కీలక పాత్ర పోషిస్తోంది. 

Leave a Comment