రేప్ లు పెరగడానికి అమ్మాయిల తల్లిదండ్రుల పెంపకమే కారణం..!

హత్రాస్ ఘటన దేశవ్యాప్తంగా దూమారం రేపుతోంది. దేశంలో ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈసమయంలో యూపీలోని బల్లియా నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యచారాలు పెరగడానికి అమ్మాయిల తల్లిదండ్రులు, వారి పెంపకమే కారణమన్నారు. అత్యాచారాలు పెరగడంపై తల్లిదండ్రులదే బాధ్యత  అని పేర్కొన్నారు. 

ప్రభుత్వ చర్యలు, శిక్షల వల్ల రేప్ లు ఆగవన్నారు. అమ్మాయిలకు మంచి విలువలు, సంస్కారం నేర్పిస్తే రేప్ లు తగ్గుతాయని పేర్కొన్నారు. తాను ఒక ఎమ్మెల్యే మాత్రమే కాదని, ఒక ఉపాధ్యాయుడిని కూడా అని తెలిపారు. సమాజంలో పద్ధతిగా ఎలా నడుచుకోవాలో తమ కూతుళ్లకు తల్లిదండ్రులు నేర్పించాలన్నారు. మంచి విలువల వల్లే ఇలాంటి ఘటనలు జరగవని అభిప్రాయపడ్డారు. 

Leave a Comment