మరణించిన భర్త ఫొటోతో.. నటి మేఘనా సీమంతం..

యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఈ ఏడాది జూన్ లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో చిరంజీవి భార్య, నటి మేఘనా రాజ్ మూడు నెలల గర్భవతి. ఇటీవల మేఘనా సీమంతం వేడుకలు ఆమె పుట్టింట్లో జరిగాయి.  భర్త చనిపోయినా ఈ వేడుకలో అతని జ్ఞాపకాలు ఉండాలని భావించింది. 

ఓ కార్యక్రమం సందర్భంగా సర్జా దిగిన ఫొటోలు కటౌట్ లాగా చేసుకుంది. సీమంతం సమయంలో తన భర్త ఫొటోను పక్కన పెట్టుకుంది. దానికి సంబంధించిన ఫొటోలను మేఘనా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎనిమిదేళ్ల పాటు చిరంజీవి, మేఘనా ప్రేమించుకుని 2018లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 

 

 

Leave a Comment