ఇదేం రాజకీయం.. ఎంఏ ప్రశ్నాపత్రంలో వైసీపీ గురించి ప్రశ్న..!

సాధారణంగా ఎగ్జామ్ పేపర్స్ లో ప్రభుత్వ విధానాల గురించి ప్రశ్నలు ఉంటాయి. కానీ పార్టీల గురించి ప్రశ్నలు అడగరు.. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రశ్నాపత్రంలో వైసీపీ గురించి ప్రశ్న అడగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది..ఎంఏ ప్రశ్నాపత్రంలో వైఎస్సార్సీపీ విధానాల గురించి ప్రశ్న వచ్చింది. దీంతో ఈ ప్రశ్నపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆంధ్రా యూనివర్సిటీ ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎంఏ పొలిటికల్ సైన్స్ పరీక్ష జరిగింది. ఆ పరీక్షా పత్రంలో ‘వైఎస్సార్సీపీ విధానాల గురించి మరియు కార్యక్రమాల గురించి వివరించండి’ అని ప్రశ్న అడిగినట్లు ఇచ్చారని ప్రశ్నాపత్రంను వైరల్ చేస్తున్నారు. దీంతో పరీక్షల్లో పార్టీకి సంబంధించిన ప్రశ్నలు అడగడం ఏంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఈ పరీక్షకు క్రిష్ణా జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బాలాజీ హాజరయ్యారట.. ప్రశ్నాపత్రంలో వైసీపీ విధానాలు, కార్యక్రమాల గురించి ప్రశ్న అడగడం ఏంటని ఆయన మండిపడుతున్నారు. రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రశ్నలు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

ప్రస్తుతం ఈ ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ పార్టీ విధానాలపై ప్రశ్న రావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి స్పందించారు. మచిలీపట్నంలో ఈ ప్రశ్నాపత్రం వైరల్ అవుతున్నట్లు తెలిసిందన్నారు. క్వశ్చన్ పేపర్ లో అలాంటి ప్రశ్న అడిగార లేదా అనే విషయం ఆరా తీస్తున్నామని, త్వరలోనే క్లారిటీ ఇస్తామని తెలిపారు. ఈ ప్రశ్న పత్రం ఫేక్ అని మరికొందరు చెబుతున్నారు. అయితే దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. 

 

 

Leave a Comment