ఊర మాస్ లుక్ లో అల్లు అర్జున్

ఎర్రతోలు కదా స్టైలిష్ గా ఉంటాడనుకుంటున్నావేమో..మాస్ ఊర మాస్..ఇది సరైనోడులో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్. ఈ డైలాగ్ కు తగ్గట్టుగానే ఉంది అల్లు అర్జులు ‘పుష్ప’ సినిమా ఫస్ట్ లుక్. సుకుమార్ దర్శకత్తంలో బన్ని హీరోగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రాన్ని ముత్తం శెట్టి నిర్మాణ భాగస్వామ్యంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. 

తాజాగా పుష్ప సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ లో అల్లు  అర్జున్ పూర్తి మాసీగా కనిపిస్తున్నాడు. శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను బట్టి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందా అని బన్నీ ఫ్యాన్స్ అంచనాలు వస్తున్నారు. 

ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం సహా సౌత్ లో అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. అయితే కరోనా ప్రభావంతో ఇప్పటికే ప్రారంభం కాల్సిన ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి  ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాడు సుకుమార్. మొత్తానికి ముందు చెప్పినట్లుగానే బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేసింది చిత్రం యూనిట్. 

Leave a Comment