పునీత్ రెండు కళ్లతో నలుగురికి కంటి చూపు.. ఇది ఎలా సాధ్యం?

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.. ఆదివారం బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. లక్షలాది మంది అభిమానులు పునీత్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. కాగా.. పునీత్ బతికి ఉన్నప్పుడు ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించారు. చివరికి చనిపోయిన తర్వాత కూడా ఆయన ఇతరులకు ఉపయోగపడ్డారు..ఆయన కళ్లను నలుగురికి అమర్చి చూపును ప్రసాదించారు. 

ఏంటీ నలుగురి ఎలా సాధ్యమైందని అనుకుంటున్నారా?.. పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన రోజు నారాయణ నేత్రాలయ వైద్యులు ఆయన కళ్లను సేకరించారు. తర్వాత వాటిని నలుగురు యువతకు అమర్చారు. సాధారణంగా రెండు కళ్లను ఇద్దరికే అమర్చుతారు.. కానీ అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఒక్కో కార్నియాను రెండు భాగాలుగా విభజించారు. 

ఈ కార్నియాను నల్లగుడ్డలోని పైపొర, లోపలి పొరగా విభజన చేశారు. వాటిని పైపొర సమస్యతో బాధపడుతున్న ఇద్దరు యువకులకు, లోపలి పొరతో బాధపడుతున్న మరో ఇద్దరు యువకులకు అమర్చినట్లు నారాయణ నేత్రాలయ చైర్మన్ డాక్టర్ భుజంగశెట్టి తెలిపారు. ఇలా మొత్తం నలుగురు యువకులకు ఆయన కళ్లను అమర్చినట్లు పేర్కొన్నారు. మిగిలిన తెల్లగుడ్డు భాగం ద్వారా తమ ల్యాబ్ లో కంటి మూట కణాలను ఉత్పత్తి చేస్తామన్నారు. ప్రమాదాల్లో ఎవరికైనా తెల్లగుడ్డకు గాయం అయితే ఆ కణాల ద్వారా ట్రీట్మెంట్ చేస్తామని వైద్యులు వెల్లడించారు. 

 

 

Leave a Comment