ఈ-రూపీని లాంచ్ చేసిన ప్రధాని మోడీ..!

దేశంలో డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ-రూపీ(e-Rupi)ని ప్రధాని మోడీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈరూపీ వోచర్ ను విడుదల చేశారు. డిజిటల్ లావాదేవీలు, నేరుగా నగదు బదిలీ విషయంలో దేశంలో ఈరూపీ కీలకపాత్ర పోషించనున్నట్లు మోడీ తెలిపారు. 

చాలా పారదర్శకంగా, ఎటువంటి లీకేజీ లేకుండా నగదును డెలివరీ చేయవచ్చని, అత్యాధునిక టెక్నాలజీ సాయంతో 21వ శతాబ్ధంలో ఇండియా ముందుకు వెళ్తున్న తీరుకు ఈ-రూపీని ఉదాహరణగా భావించవ్చని ప్రధాని మోడీ తెలిపారు. మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ-రూపీని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. 

ఈ-రూపీ అంటే ఏమిటీ?

  • డిజిటల్ చెల్లింపులు సులభతరం చేసేందుకు ఈ-రూపీ తీసుకొచ్చారు. 
  • సెఫ్, సెక్యూర్ గా ఉంటుంది. 
  • ఈ-రూపీ విధానంలో వినియోగదారుల వివరాలు గోప్యంగా ఉంటాయి. 
  • క్యూఆర్ కోడ్, ఎస్ఎంఎస్ స్ట్రింగ్ ఓచర్లను లబ్ధిదారుడికి పంపడం ద్వారా చెల్లింపులు జరుగుతాయి. 
  • బ్యాంక్ అకౌంట్, కార్డులు, యాప్ లతో సంబంధం లేకుండా లావాదేవీలు జరపవచ్చు.
  • కార్డు, పేమెంట్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకుండానే చెల్లింపులు చేయవచ్చు.  

Leave a Comment