భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది మూర్ము ప్రమాణస్వీకారం..!

భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది మూర్ము ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ద్రౌపది ముర్ము చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పదవీ పత్రాలపై ఆమె సంతకాలు చేసి జాతినుద్దేశించి ప్రసంగించారు..   

దేశ ప్రజలకు రాష్ట్రపతి ముర్ము కృతజ్ఞతలు తెలిపారు. ఒకప్పుడు చదువుకోవడం తన కల అని, తమ గ్రామంలో పదో తరగతి చదువుకున్న మొదటి బాలికను తానే అని అన్నారు. ఇప్పుడు రాష్ట్రపతి అయ్యానన్నారు. అందరి విశ్వాసం, సంక్షేమం కోసం పాటుపడతానన్నారు. ఓ సాధారణ ఆదివాసీని దేశ అత్యున్నత స్థానంలో నిలబెట్టారన్నారు. మీ విశ్వాసం నిలబెట్టేందుకు కృషి చేస్తాన్నారు. భారత్ ప్రగతి పథంలో నడుస్తోందన్నారు. ఇంకా వేగంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 

Leave a Comment