భారత రాష్ట్రపతి జీతం ఎంతో మీకు తెలుసా?

భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేశారు.. ప్రతిభా పాటిల్ తర్వాత రాష్ట్రపతిగా ఎన్నికైన రెండో మహిళగా నిలిచారు.. రాష్ట్రపతి భారత ప్రభుత్వానికి అధిపతి.. దేశంలోని అన్ని సాయుధ దళాల అధిపతి.. దేశ ప్రథమ పౌరుడు.. దేశ ఐక్యతకు చిహ్నం.. దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తికి అధికారాలు ఏంటీ? రాష్ట్రపతిగా ఉన్న సమయంలో పదవీ విరమణ చేసిన తర్వాత వారికి ప్రభుత్వం నుంచి అందే సౌకర్యాలు, ఎంత జీతం లభిస్తుందో ఇప్పుడు చూద్దాం..

రాష్ట్రపతికి కావాల్సిన అర్హతలు:

  • భారత పౌరుడై ఉండాలి..
  • 35 ఏళ్లు నిండి ఉండాలి.
  • లోక్ సభ ఎంపీగా ఎన్నికై ఉండాలి. 

రాష్ట్రపతికి జీతం ఎంత?

భారత రాష్ట్రపతికి నెలకు జీతం రూ.5 లక్షలు.. 7వ వేతన సంఘం అమలు తర్వాత రాష్ట్రపతి జీతం 200 శాతానికి పైగా పెరిగింది. 2017 వరకు రాష్ట్రపతికి నెలకు రూ.1.5 లక్షలు జీతం ఉండేది.. కానీ ఆ తర్వాత జీతం నెలకు రూ.5 లక్షలకు పెంచారు.

రిటైర్ట్ అయ్యాక బెన్ ఫిట్స్:

పదవీ విరమణ తర్వాత రాష్ట్రపతికి నెలకు రూ.1.5 లక్షలు పెన్షన్ ఉంటుంది. రాష్ట్రపతి జీవిత భాగస్వామికి నెలకు రూ.30 వేలు పెన్షన్ అందుతుంది. ఎలాంటి అద్దె చెల్లించకుండానే పెద్ద బంగ్లాలో నివాసం ఉండొచ్చు. ఐదుగురు ఉద్యోగులను నియమించుకునే వెసులుబాటు ఉంటుంది.    

రాష్ట్రపతి నివాసం ఏదీ?

రాష్ట్రపతి భవన్.. భారత రాష్ట్రపతికి నివాసం.. రాష్ట్రపతి భవన్ 2,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 330 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ భవనంలో 340 గదులు ఉన్నాయి. 

రాష్ట్రపతి ప్రయాణించే కారు..

రాష్ట్రపతి ప్రీమియమ్ కార్లలోనే ప్రయాణిస్తారు. సెక్యూరిటీ సిస్టమ్ తో కూడిన బుల్లెట్, షాక్ ప్రూఫ్ కార్ ను అందిస్తారు. దానికి లైసెన్స్ ప్లేట్ ఉండదు. 

భద్రత

భారత సాయుధ బలగాలకు చెందిన సైనికులు రాష్ట్రపతికి బాడీగార్డులుగా ఉంటారు. త్రివిధ దళాలకు చెందిన సైనికులు రక్షణ కల్పిస్తారు.   

Leave a Comment