PM-Kisan లో సులభంగా ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి..

Pradhan Mantri Kisan Samman Nidhi Yojana ను PM – Kisan  అని కూడా పిలుస్తారు.  ఇది దేశంలోని రైతులకు ప్రయోజనం చేకూర్చే ఒక పథకం. PM Kisan  పథకం కింద దేశంలోని ప్రతి రైతుకు మొత్తం రూ. 6 వేలను మూడు విడతలుగా అందజేస్తారు. ఒక్కో విడతకు రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకానికి 2 హెక్టార్ల వరకు భూమి కలిగి ఉన్న చిన్న, సన్నకారు రైతులు అర్హులు. ఎవరైనా రైతులు ఈ పథకంలో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇప్పుడే అప్లయి చేసుకోండి. 

PM – Kisan పథకం కోసం రైతులు రెండు పద్ధతుల ద్వారా నమోదు చేసుకోవచ్చు. PM – Kisan పోర్టల్, pmkisan.gov.in ద్వారా లేదా సమీప కామన్ సర్వీస్ సెంటర్ ని సందర్శించి నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు PM – Kisan కోసం ఆన్ లైన్ లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం..

PM – Kisan Samman Nidhi ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ – 2020

 PM – Kisan యోజన కోసం దరఖాస్తు చేసుకునే విధానం..

  • మొదట మీరు అధికారిక వెబ్ సైట్ pmkisan.gov.in కు వెళ్లండి. అప్పుడు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో మీరు ‘FARMER CORNER’ ను ఎంపిక చేయాలి.
  • అప్పుడు ‘NEW FARMER REGISTRATION’ పై క్లిక్ చేయండి.

  • అక్కడ మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో మీరు ఆధార్ కార్డు నెంబర్ మరియు కాప్చా ఎంటర్ చేసి Click here to continue మీద క్లిక్ చేయాలి.
  • అక్కడ మీ వివరాలను నమోదు చేయాలి. (పేరు, మొబైల్ నెంబర్, బ్యాంక్ మరియు భూమి వివరాలు మొదలైనవి).
  • చివరగా దాన్ని సేవ్ చేసి సబ్మిట్ చేయడి.
  • అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు రెఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతాయి. దీనిని మీరు భద్రపరచుకోవాలి. 

PM – Kisan కొత్త రిజిస్ట్రేషన్ ఫారంCLICK HERE

PM – Kisan స్టేటస్ చెక్ చేసుకోవడం కోసంCLICK HERE

PM – Kisan హెల్ప్ లైన్ నెంబర్లు

ఏదైన సహయం కోసం మీరు నేరుగా 155261 లేదా 1800115526(టోల్ ఫ్రీ) నెంబర్లకు కాల్ చేయవచ్చు. 

 

Leave a Comment