ఇక స్క్రీన్ పై ‘పవర్ స్టార్’ ట్యాగ్ లేనట్టేనా.. పవన్ కళ్యాణ్ దీనిపై క్లారిటీ ఇచ్చారా..!

పవర్ స్టార్ అంటే గుర్తొచ్చే పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ గానే ఆయన ప్రేక్షకులకు, అభిమానులకు సుపరిచతం.. ఆ ట్యాగ్ కే పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ పవర్ స్టార్ ట్యాగ్ ని పవన్ కల్యాణ్ ఇప్పుడు వద్దంటున్నారా? ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానులకు షాక్ కు గురిచేసింది. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ‘రిపబ్లిక్’. ఈ సినిమా అక్టోబర్ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమంలోని ఇబ్బందులు, ప్రభుత్వాల విధానాలపై తన దైన శైలిలో కామెంట్ చేశారు. ముందుగా తన ‘పవర్ స్టార్’ ట్యాగ్ పై హాట్ కామెంట్స్ చేశారు. ‘సీఎం అవుతానా? లేదా? అనేది కాదు.. పోరాటం చేస్తున్నామా? లేదా? అనేది ముఖ్యం. పవర్ లేని వాడికి పవర్ స్టార్ ట్యాగ్ ఎందుకు? అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గత కొంత కాలంగా ఇక నుంచి పవర్ స్టార్ ఉండదు అనే కథనాలు వినిపించాయి. వాటిని పుకార్లుగానే అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు పవర్ స్టార్ ట్యాగ్ పై వస్తున్న పుకార్లకు బలం చేకూర్చేలా ఉన్నాయి. స్వయంగా పవన్ కళ్యాన్ ఈ వ్యాఖ్యలు చేయడంతో అభిమానులు షాక్ అయ్యారు. 

Leave a Comment