దొరకని ఇంజెక్షన్ ను ఎందుకు సిఫార్స్ చేస్తున్నారు? ప్రశ్నించిన సోనూసూద్ ..!

కరోనా ఫస్ట్ వేవ్ లో ఎంతో మంది వలస కార్మికులను ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. కరోనా సెకండ్ వేవ్ లోనూ తన సేవలను కొనసాగిస్తున్నాడు. ఆక్సిజన్ అవసరమైన వారికి ఆక్సిజన్ అందిస్తున్నాడు. ఇక అవసరమైన వారికి ఎలాంటి మెడిసిన్ కావాలన్నా బాధితులకు అందిస్తున్నాడు ఈ రియల్ హీరో..

అయితే ఒక ఇంజెక్షన్ అందుబాటులో లేనప్పటికీ వైద్యులు సిఫార్సు చేయడంపై సోనూసూద్ ఆందోళన వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ప్రత్యామ్నాయాన్ని సూచించవచ్చకదా అని వైద్యులను అడుగుతూ ఒక పోస్ట్ షేర్ చేశాడు.. అందులో వైద్యులను మూడు ప్రశ్నలు వేశారు..

  • ‘ఒక ఇంజెక్షన్ ఎక్కడా దొరకట్లేదని తెలిసినా డాక్టర్లు ఎందుకు అదే సూచిస్తున్నారు?
  • ఆస్పత్రులే ఆ మెడిసిన్ తేలేకపోతే సామాన్యులకు దొరుకుతుందా?
  • ప్రత్యామ్నాయ ఔషధాన్ని వాడి ప్రజల జీవితాలను కాపాడలేమా?

అంటూ పరోక్షంగా రెమ్ డెసివిర్ కొరత గురించి సోనూసూద్ ప్రశ్నించారు. 

Leave a Comment