కరోనాపై పుకార్లు సృష్టించడంలో మన దేశమే ఫస్ట్..!

సోషల్ మీడియాలో కరోనాపై పుకార్లు సృష్టించిన దేశాల లిస్టులో భారత్ మొదటిస్థానంలో నిలిచింది. సేజెస్ ఇంటర్నేషన్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్స్ అండ్ ఇన్ స్టిట్యూషన్స్ జర్నల్ నివేదికలో తేలింది. ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగంతో పాటు వాటిపై సరైన అవగాహన లేకపోవడం వల్లే భారత ప్రజలు ఇలా చేస్తున్నారని పేర్కొంది. 

ఈ పరిశోధన మొత్తం 138 దేశాల్లో నిర్వహించారు. 9,657 భాగాల సమాచారాన్ని ఆన్ లైన్ నుంచి సేకరించారు. ఆయా సమాచారాన్ని 94 సంస్థల సహాయంతో ఫ్యాక్ట్ చెక్ చేేశారు. ఇందులో 18.07 శాతంలో భారత్ ప్రపంచంలోనే అత్యధిక కరోనా ఫేక్ న్యూస్ సృష్టించినట్లు గుర్తించారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఈ ఫేక్ న్యూస్ వ్యాపించినట్లు కనుగొన్నారు. ఇండియాలో తక్కువ ధరకే ఇంటర్నెట్ అందుబాటులో ఉండటం, సోషల్ వాడకం అధికంగా ఉండటం, ఇంటర్నెట్ అక్షరాస్యత తక్కువగా ఉండటంతోనే ఈ ఫేక్ న్యూస్ ప్రచురితమైందని జర్నల్ పేర్కొంది. అంతేకాదు ఒక్క ఫేస్ బుక్ లోనే 66.87 శాతం అసత్య సమాచారం వ్యాపించిందని తేలింది. తర్వాతి స్థానాల్లో అమెరికా, బ్రెజిల్, స్పెయిన్ ఉన్నట్లు అధ్యయనం స్పష్టం చేసింది. 

Leave a Comment