తిరుమలలో ‘సేంద్రియ భోజనం’.. మెనూ ఇదే..

తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. తిరుమల అన్నమయ్య భవనంలో భక్తులకు గో ఆధారిత దేశీయ వ్యవసాయ పద్ధతుల్లో పండించిన సంప్రదాయ భోజనాన్ని వడ్డించనున్నారు. సేంద్రియ విధానంలో పండించిన బియ్యం, పప్పు దినుసులతో తయారు చేసిన అల్పాహారం, భోజనాన్ని లాభాపేక్ష లేకుండా కాస్టు టు కాస్టుతో టీటీడీ భక్తులకు అందించాలని సంకల్పించింది.గురువారం ప్రయోగాత్మకంగా కొందరికి ఈ భోజనం అందించారు.

సెప్టెంబర్ 8 వరకు ఉచితంగానే ఈ అన్నప్రసాదాన్ని ఇస్తారు. సంప్రదాయ భోజనంపై భక్తుల అభిప్రాయాలు, సూచనలు తీసుకున్న తర్వాత పరిమిత ధరతో అందిస్తారు. మరో 15 నుంచి 20 రోజుల్లో దీన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. 

గో ఆధారిత భోజనం ఇదే:

  •  ఉదయం పుల్లకారు బియ్యంతో ఇడ్లీలు, కాలా బాత్ బియ్యంతో ఉప్మా తయారు చేసి అందించారు. 
  • ఇందులో శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు, అనేక వ్యాధులను ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. 
  • మధ్యాహ్నం కొబ్బరి అన్నం, పులిహోర, పూర్ణాలు, వర్ష రుతువులో తీసుకోవాల్సిన ఆహారమైన పచ్చిపులుసు, దోసకాయ పప్పు తదితర 14 రకాల వంటకాలు చేసి అందించారు. 

 

Leave a Comment