వయాగ్రా ఇవ్వగానే కోలుకున్న కోమాలో ఉన్న మహిళ..!

వైద్యశాస్త్రంలో కొన్ని సంఘటనలు ఆశ్యర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి ఘటన యూకేలో జరిగింది. కరోనాతో దాదాపు 28 రోజులు కోమాలో ఉన్న ఒక నర్సుకు వైద్యులు వయాగ్రా ఇవ్వగానే వెంటనే కోలుకుంది. ఈ ఘటన డాక్టర్లను కూడా ఆశ్చర్యపరిచేలా చేసింది.

వివరాల మేరకు యూకేలోని లింకన్ షైర్ కి చెందిన మోనికా అల్మేడా అనే 37 సంవత్సరాల నర్సు నవంబర్ 9న కరోనాతో ఆస్పత్రిలో చేరింది. వారం రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం విషమించింది. దీంతో నవంబర్ 16న కోమాలోకి వెళ్లిపోయింది. ఆమెకు వైద్యులు ఐసీయూలో పెట్టి చికిత్స అందించారు. ప్రయోగాత్మక ఔషధాల అధ్యయనంలో ఇష్టపూర్వకంగా పాల్గొంటున్నట్లు ఆమె కోమాలో వెళ్లడానికి ఒకరోజు ముందు అంగీకార పత్రంపై సంతకం చేసింది.

దీంతో చికిత్స ప్రణాళికలో భాగంగా సెక్స్ సామర్థ్యాన్ని పెంచే వయాగ్రాను అల్మేడాకి అధిక మోతాదులో ఇచ్చారు. ఇది ఆమె శరీరంలోని ధమనులను మరింత ఉద్వేగానికి గురిచేసింది. దీంతో రకర్తప్రసరణ సాఫీగా జరిగి కోమా నుంచి కోలుకుంది. డిసెంబర్ 14న కోమా నుంచి కోలుకుని ఇంటికి తిరిగి వెళ్లింది. కాగా.. సెక్స్ సామర్థ్యం పెంచే వయాగ్రాను నైట్రస్ ఆక్సైడ్ మాదిరిగా ఆక్సిజన్ స్థాయిలను పంచడానికి వాడాలా లేదా అని తెలుసుకోవడానికి పలు పరీక్షలు చేయాల్సి ఉందని వైద్యులు పేర్కొన్నారు.  

 

 

Leave a Comment