29 ఏళ్ల యువకుడు వింత ప్రకటన..!

అరేంజ్‌డ్ మ్యారెజ్ నాకొద్దు.. నన్ను కాపాడండి!అనే హోర్డింగ్ ఇప్పుడు లండన్ లో తెగ వైరల్ అవుతా ఉంది. వివాహం అనేది జీవితంలో ఒక్కసారి వచ్చే ప్రక్రియ. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని బాగా చేసుకోవాలను కుంటారు. పెళ్ళి లేదా వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. 

ఓ వయసు వచ్చాక ఆడా, మగా ఇద్దరూ తోడు కోసం వెతుక్కుంటారు. పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలవుదామని అనుకుంటారు. అప్పటికే గర్ల్‌ఫ్రెండో బాయ్‌ఫ్రెండో ఉంటే వారినే పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. లేదా టిండర్ వంటి డేటింగ్ యాప్‌ల ద్వారా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇక విదేశాల్లో అయితే.. చిట్టచివరి ప్రయత్నంగా స్నేహితులు బంధువుల ద్వారా పరియమైన వారిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. కుదిరితే వివాహం చేసుకుంటారు.

పెళ్లి విషయములో నేటి యువతరానికి ఎన్నో కలలు,ఊహలు,ఆశలు ఉంటాయి.కొత్తగా పెళ్లి చేసుకోవాలి అని,మాట్రిమోనీలు చుట్టు తిరుగుతూ వుంటారు.వీటి అన్నికిటికి డిఫరెంటగా ఓక యువుకుని తెలివి పెళ్లి విషయము లో ఇలా వుందో చూడండి. లండన్‌కి చెందిన 29 ఏళ్ల వ్యక్తి భార్య కోసం వెతకడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.అతడు అనుసరించిన మార్గం ఇప్పుడు ఆసక్తికరంగా అనిపిస్తోంది. కొత్తగా అందరి అభిరుచికి డిఫరెంట్ గా ఉంది.

మొహమ్మద్ మాలిక్ అనే వ్యక్తి లండన్, బర్మింగ్‌హామ్‌లోని బిల్‌బోర్డ్‌లపై ప్రకటన ఇవ్వడం ద్వారా తనకు కాబోయే భాగస్వామి కోసం సెర్చ్ చేస్తున్నాడు. బిల్‌బోర్డ్‌లపై రిలాక్స్‌డ్‌గా ఉన్న మాలిక్ చిత్రాన్ని పెట్టి, “పెద్దలు కుదిర్చిన పెళ్లి నుంచి నన్ను రక్షించండి” అంటూ అందులో రాసుకొచ్చారు

అయితే, పెద్దలు కుదిర్చిన వివాహానికి వ్యతిరేకం కాదని, కానీ, “మొదట నా స్వంత వ్యక్తిని వెతకడానికి ఇష్టపడతానని చెప్పాడు మాలిక్. ‘Findmalikawife.com’ అనే వెబ్‌సైట్‌ను కూడా ఇందుకోసం ఏర్పాటు చేశాడు మాలిక్. భార్య కోసం బర్మింగ్‌హామ్ అంతటా అనేక ప్రకటనల హోర్డింగ్‌లను ఏర్పాటు చేశాడు.

బిల్‌బోర్డ్‌లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో పెద్దలు కుదిర్చిన పెళ్లి నుంచి నన్ను కాపాడండి అంటూ సరదాగా అడుగుతున్నట్టుగానే.. మాలిక్ నవ్వుతూ ఉండే ఫోటోను పెట్టారు. ఇంకా సరైన అమ్మాయి దొరకలేదు. నాకు నచ్చేలా అమ్మాయిని కనిపెట్టడం కష్టంగా ఉంది. అని అందులో రాసుకొచ్చాడు. అయితే ఈ ప్రకటనలకు అతడు ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ రావడంతో అతడు ఉబ్బితబ్బిబైపోతున్నాడు. త్వరలో తన పెళ్లైపోతుందని చెబుతున్నాడు.

 

Leave a Comment