ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ వచ్చేశాయ్..!

ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి భీం ఫస్ట్ లుక్ ను సినిమా యూనిట్ విడుదల చేసింది. దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొమరం భీం లుక్ ను విడుదల చేస్తూ ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలియేజేశారు.. ఈ ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ రౌద్రంగా కనిపిస్తున్నారు… 

అటు NTR30 టీమ్ కూడా అభిమానులకు ఓ సర్ ప్రైజ్ ని అందించింది. ఎన్టీఆర్ కొత్త లుక్ ని విడుదల చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపింది.  ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఇది ఎన్టీఆర్ కు 30వ సినిమా.. ఎన్టీఆర్ ఆర్ట్స్, నందమూరి కల్యాణ్ రామ్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా వ్యవహరించనుననారు. NTR30 టీమ్ విడుదల చేసిన పోస్టర్ లో ఎన్టీఆర్ ఫార్మల్ డ్రస్ లో స్మార్ట్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

 

Leave a Comment