‘హ్యాపీబర్త్ డే రాక్ స్టార్’.. జూనియర్ ఎన్టీఆర్ కు అత్త విషెస్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఎన్టీఆర్ అత్త, బీజేపీ మహిళ నేత పురంధేశ్వరి కూడా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు..

‘మీరు చాలా ప్రత్యేకమైన వారు.. అందుకే మనోహరమైన ముఖం ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి.. హ్యాపీ బర్త్ డే రాక్ స్టార్’ అంటూ పురంధేశ్వరి ట్వీట్ చేశారు. 

ఇక ఎన్టీఆర్ అభిమానులు మాత్రం నిన్నటి నుంచే ఆయన పుట్టినరోజు సెలెబ్రేషన్స్ మొదలుపెట్టారు. నిన్నిటి నుంచే ట్విట్టర్ లో హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఈ కరోనా సంక్షోభంలో బహిరంగంగా తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దని అభిమానులు కోరారు..

Leave a Comment