ఎన్టీఆర్ సినీ ప్రస్థానానికి 20 ఏళ్లు.. ఫొటోలు వైరల్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ ప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఎన్టీఆర్ మొదటగా బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో బాల నటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత బాల రామాయణం చిత్రంలో రాముడిగా నటించాడు. అయితే హీరోగా మాత్రం 2001లో వచ్చిన నిన్నుచూడాలని(Ninnu Chudalani) చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. 

ఆ తర్వాత స్టూడెంట్ నం.1(Student No.1) చిత్రం ద్వారా మంచి విజయం అందుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సుబ్బు(Subbu) పరాజయం పొందింది. అనంతరం వివి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది(Aadi) చిత్రంలో  అతని నటతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన అడవి రాముడు(Adavi Ramudu) బాగా ఆడలేదు. ఆ తరువాతి సింహాద్రి(Simhadri) సినిమా రికార్డులు తిరగరాసింది.

అయితే సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ వరుస పరాజయాలను చూశాడు. ఆంధ్రావాలా(Andhrawala), సాంబ(Samba), నా అల్లుడు(Naa Alludu), నరసింహుడు(Narasimhudu), అశోక్(Ashok) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి. రాఖీ(Rakhi) సినిమా పర్వాలేదనిపించింది. ఆ తర్వాత 2007లో రాజమౌళి దర్శత్వంలో చేసిన యమదొంగ(Yama Donga) మంచి విజయం సాధించింది. 2008లో చేసిన కంత్రి(Kantri) సినిమా ఫ్లాప్ అయింది.

ఇక కొంత గ్యాప్ తీసుకొని 2010లో వివి.వినాయక్ తో చేసిన అదుర్స్(Adurs) సినిమా మంచి విజయం సాధించింది. అదే ఏడాది వచ్చిన బృందావనం(Brundavanam) సూపర్ హిట్ గా నిలిచింది. అనంతరం వచ్చిన శక్తి(Shakti) ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత వచ్చిన ఊసరవెల్లి(Oosaravelli), దమ్ము(Dammu) చిత్రాలు మెప్పించలేకపోయాయి. ఆ తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్ షా(Badshah) మంచి విజయం నమోదుచేసుకోగా, రామయ్యా వస్తావయ్యా(Ramayya Vastavayya), రభస(Rabhasa) చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. 

ఇక ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్(Temper) సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత సుకుమార్ దర్శక్వంలో చేసిన తన 25వ సినమా నాన్నకు ప్రేమతో(Nannaku Prematho) మంచి విజయం సాధించింది. తర్వాత వచ్చిన జనతా గ్యారేజ్(Janatha Garrage), జై లవ కుశ(Jai Lava Kusha) చిత్రాలు కూడా విజయం సాధించాయి. 2018లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ(Aravinda Sametha) చిత్రం ఘన విజయం సాధించింది. దీని తర్వాత రాజమౌళి దర్వకత్వంలో రామ్ చరణ్ తో మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్(RRR) లో నటిస్తున్నాడు.  

Leave a Comment