పెళ్లి చేసుకున్న నోబెల్ బహుమతి గ్రహీత మలాలా..!

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ పెళ్లి చేసుకున్నారు. బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరిగింది. తాను అస్సర్ తో పెళ్లి చేసుకున్నట్లు మాలాలా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన వివాహానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. 

ఈ రోజు తన జీవితంలో ఎంతో ముఖ్యమైనదని, అస్సర్, తాను జీవిత భాగస్వాములు అయ్యామని మాలాలా వెల్లడించారు. బర్మింగ్ హామ్ లోని తన ఇంట్లో ఇరు కుటుంబాల సమక్షంలో నిరాడంబరంగా నికా వేడుకను నిర్వహించామని పేర్కొంది. మీ ఆశీస్సులు తమకు అందించాలని కోరింది. భార్యభర్తలుగా కొత్త ప్రయాణం కలిసి సాగించడానికి సంతోషంగా ఉన్నామని మలాలా ట్వీట్ చేశారు. అయితే మలాలా పెళ్లి చేసుకున్న అస్సర్ మాలిక్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చెందిన హై పెర్ఫార్మెన్స్ సెంటర్ జనరల్ మేనేజర్ గా గుర్తించారు. అయితే దీనిపై ఎలాంటి ధ్రువీకరణ లేదు. 

బాలిక విద్య కోసం మలాలా పోరుడుతోంది. మలాలా ఫండ్ పేరుతో బాలికల విద్య కోసం చారిటీ సంస్థను ఏర్పాటు చేసింది. ఈక్రమంలో తన సేవలను గుర్తించిన నోబెల్ కమిటీ 2014లో మలాలాకు నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేసింది. దీంతో 17 ఏళ్ల అతిపిన్న వయస్కురాలిగా నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తిగా మలాలా నిలిచింది. బాలికల విద్య కోసం, ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తినందుకు 2012లో మలాలాపై తాలిబన్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆమెకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఆ తర్వత ఆమె కోలుకుని బ్రిటన్ లోనే తల్లితండ్రులతో కలిసి ఉంటున్నారు.  

Leave a Comment