చైనాలో ఇకపై నో మాస్క్..!

చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. చైనా రాజధాని బీజింగ్ లో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదంటూ చైనా ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 13 రోజులుగా అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ఈ సడలింపు ఇచ్చారు. అయినా బీజింగ్ లో ప్రజలు మాస్క్ లు ధరించి కనిపించడం గమనార్హం.

అయితే సామాజిక ఒత్తిడి, సురక్షితను దృష్ట్యా మాస్క్ ధరించడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. ఏప్రిల్ చివరిలోనే బీజింగ్ మున్సిపల్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ అవసరం లేదని చెప్పిన సంగతి తెలిసిందే.. కానీ నగరంలో కొత్త కేసులు నమోదు కావడంతో నిబంధలను మళ్లీ అమల్లోకి వచ్చాయి. తాజాగా బీజింగ్, జిన్జియాంగ్, ఇతర ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదు. టెస్టింగ్, ట్రేసింగ్, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, హోం క్వారంటైన్ వంటి నిబంధలను కఠినంగా అమలు చేయడం ద్వారా కరోనా నియంత్రణలోకి వచ్చనట్లు చైనా ఆరోగ్యశాఖ అధికారులు వివరించారు. 

 

Leave a Comment