ఇండియాలో డిసెంబర్ నాటికి కరోనా ఖతం..!

భారతదేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో భారతదేశంలో డిసెంబర్ 3 నాటికి కరోనా వైరస్ అంతమవుతుందని ‘టైమ్ ఫ్యాక్ట్స్ – ఇండియా ఔట్ బ్రేక్ రోపార్టు’  పేర్కొంది. అయితే సెప్టెంబర్ తొలివారంలో కరోనా కేసుల సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతాయని చెప్పింది. ఆ తర్వాత క్రమక్రమంగా తగ్గుతాయని వెల్లడించింది. ఇక ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నైలలో వైరస్ తగ్గుముఖం పట్టడాన్ని సానుకూల అంశంగా పేర్కొంది. 

ఇక ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో నవంబర్ నాటికి, చెన్నైలో అక్టోబర్ నాటికి కరోనా కనుమరుగయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది. విశ్వసనీయ ప్రభుత్వ వర్గాల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను వెల్లడించినట్లు తెలిపింది. అదేవిధంగా కరోనా వ్యాప్తిలో రీప్రొడక్షన్ రేటులో తగ్గుదల నమోదవుతుందని పేర్కొంది. 

ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ నాటికి, తెలంగాణలో అక్టోబర్ 17 నాటికి కరోనా పూర్తిగా కనుమరుగుకావచ్చని అంచనా వేసింది. జనాభా, కరోనా నిర్ధారణ పరీక్షలు, కంటైన్మెంట్ జోన్ల తదితర అంశాల ఆధారంగా కరోనా తీవ్రతను అంచనా వేసినట్లు పేర్కొంది. అయితే ఈ వివరాల్లో కాస్త మార్పులు చేర్పులు ఉండవచ్చని తెలిపింది. 

 

Leave a Comment