నిత్యానంద మరో సంచలనం..కైలాసలో సొంతంగా రిజర్వు బ్యాంక్..!

స్వామి నిత్యానంద ప్రతి ఒక్కరికీ గుర్తు ఉండే ఉంటారు..కర్నాటకలో ఆశ్రమం స్థాపించి లీలు ప్రదర్శించారు. తాజాగా ఆయన సంచలన ప్రకటన చేశారు. ఈ మధ్య తన దేశంగా చెప్పుకుంటున్న కైలాస ద్వీపంలో రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈనెల 22న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస పేరుతో ప్రారంభించనున్నట్లు వెల్లడించాడు. అదే రోజు నుంచి RBK కరెన్సీ చెలామణిలో ఉటుందని నిత్యానంద పేర్కొన్నారు. 

అంతే కాదు దీని కోసం పలు దేశాల బ్యాంకులతో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. కైలాసలో ఏ దేశ కరెన్సీ అయినా చెల్లు బాటు అవుతుందని స్పష్టం చేశారు. అలాగే RBK కరెన్సీ కూడా అన్ని దేశాల్లో చెలామణి అవుతుందన్నారు. దీనికి సంబంధించి విధివిధానాలను ఈనెల 22న ప్రకటిస్తామని నిత్యానంద పేర్కొన్నారు. సోషల్ మీడియాలో మాత్రం ఆ బ్యాంక్ కు సంబంధించిన కరెన్సీ కూడా వైరల్ అవుతుంది. 

అంతా ఫేకే..

ఇదిలా ఉండగా..నిత్యానంద ఎక్కడున్నారో ఎవరికీ తెలియడం లేదు. ఆయన పేరుతో చేసిన ప్రకటనలు మాత్రమే వస్తున్నాయి. అయితే ఆయన చేసిన ప్రకటనలు అన్ని ఫేకే అంటుంది ఈక్వేడార్ ప్రభుత్వం. ఈక్వెడార్ పక్కనే నిత్యానంద కొనుగోలు చేసిన కైలాస దేశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ వ్యవహారం అంతా ఒట్టిదే అని ఈక్వెడార్ చెబుతోంది. గతంలో ప్రభుత్వం, శాఖలు అంటూ హడావిడి చేసిన నిత్యానంద అసలు తమ దేశంలో కాని, చుట్టు పక్కల కానీ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టడం లేదని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే జనాలను మోసం చేసేందుకు నిత్యానంద మరో ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది..

 

Leave a Comment